అంబులెన్సులో ప్రసవం
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:14 PM
మండలంలోని బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణిని సోమవారం అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. అనంతరం తల్లి, బిడ్డను అంబులెన్సు సిబ్బంది రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు.
తల్లి, బిడ్డ క్షేమం
కొయ్యూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణిని సోమవారం అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. అనంతరం తల్లి, బిడ్డను అంబులెన్సు సిబ్బంది రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు.
బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లి గ్రామానికి చెందిన కె.రాములమ్మ అనే నిండు గర్భిణికి సోమవారం ఉదయం పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సిబ్బంది వెంటనే స్పందించి చీడిపల్లి చేరుకున్నారు. ప్రసవ వేదన అనుభవిస్తున్న రాములమ్మను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకు తరలిస్తుండగా చింతవానిపాలెం గ్రామ సమీపంలో పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. ఇది గుర్తించిన అంబులెన్సు ఈఎంటీ కొండలరావు, పైలట్ వరప్రసాద్‌లు వాహనాన్ని పక్కకు ఆపి ప్రసవానికి చర్యలు చేపట్టారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, మెరుగైన వైద్య సేవల కోసం వారిని రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించినట్టు అంబులెన్సు సిబ్బంది తెలిపారు.