భవనాలకు నిధులు ఇవ్వకే ఆలస్యం: మనోహర్
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:54 AM
‘రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాలకు భవనాలు నిర్మించడానికి గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ‘రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాలకు భవనాలు నిర్మించడానికి గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. దీంతో నిర్మాణాల్లో జాప్యం జరిగింది’ అని మంత్రి మనోహర్ చెప్పారు. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘రాష్ట్రవ్యాప్తంగా 10,216 రైతు సేవా కేంద్రాల్లో 5,346 పూర్తి చేసి, వ్యవసాయ శాఖకు అప్పగించాం. 2,057 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. మరో 2,782 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు’ అని తెలిపారు. రాష్ట్రంలో బహుళ ప్రయోజన ఆరోగ్య పురుష కార్యకర్తల శిక్షణ కేంద్రాలు కడప, శ్రీకాకుళం, ఏలూరులో పని చేస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. కడపలో 25 పోస్టులకు 17, ఏలూరులో 17 పోస్టులకు 10, శ్రీకాకుళంలో 17కు 13 పోస్టులు భర్తీ చేసినట్లు టీడీపీ సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.