కరువు మండలాలుగా ప్రకటించండి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:45 PM
దేవనకొండ, ఆస్పరి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి వైకుంఠం జ్యోతి కోరారు.
దేవనకొండ/ఆలూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేవనకొండ, ఆస్పరి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి వైకుంఠం జ్యోతి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకులు కలెక్టరు సిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో దేవనకొండ, ఆస్పరి మండలాల్లో పంటలు ఎండిపోయి కరువు ఛాయలు అలుముకున్నాయన్నారు. ఈ తరుణంలో కరువు మండలాల జాబితాలో రెండు మండలాల పేర్లు చేర్చాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ విజయభాస్కర్‌గౌడ్, ఆలూరు మార్కెట్‌యార్డు చైర్మన వెంకటేష్, వైస్ చైర్మన మల్లెపల్లి రంగడు, సొసైటీ చైర్మన రాజశేఖర్, కప్పట్రాళ్ల మల్లికార్జున, ఆకుల వీరేష్, రామారావునాయుడు, వెంకటస్వామిగౌడ్, మల్లికార్జునగౌడ్, శాంతి, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.