Share News

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

ABN , Publish Date - May 08 , 2026 | 05:31 AM

‘అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

  • రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు, లోకేశ్‌ కృషితో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారు. రాయలసీమను పారిశ్రామిక, ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో రాయలసీమ ప్రాంతానికి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.4 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కర్నూలులో 300 ఎకరాల్లో డ్రోన్‌ సిటీ నిర్మాణం జరుగుతోంది. దీని ద్వారా 40 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. సత్యసాయి-తిరుపతి జిల్లాల సరిహద్దులో తొలిసారిగా స్పేస్‌ సిటీ ఏర్పాటు కానుంది. క్యారియర్‌ ఏసీ సంస్థ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఇలా ఎన్నో రాయలసీమ ప్రాంతానికి వస్తున్నాయి. రాయలసీమను దేశంలోనే నంబర్‌ వన్‌ సోలార్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు.

Updated Date - May 08 , 2026 | 05:31 AM