వైభవంగా దసరా సంబరాలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:10 AM
పట్టణంలో దసరా పండగ సందర్భంగా నిర్వహించిన రావణ, కుంభకర్ణుల దహనం వేడుకలు వైభవంగా సాగాయి.
రావణ దహనం చేసిన
ఎమ్మెల్యే పార్థసారథి
పోటెత్తిన జనం
ఆదోని, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో దసరా పండగ సందర్భంగా నిర్వహించిన రావణ, కుంభకర్ణుల దహనం వేడుకలు వైభవంగా సాగాయి. మంగళవారం రాత్రి స్థానిక మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో మైదానం జనసంద్రంగా మారింది. పండగ వాతావరణంలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మైదానంలో ఆనవాయితీగా నిర్వహించే రావణ దహనం కోసం ఎప్పటిలాగే రాకెట్ బాణాలను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో దహన ఘట్టం ప్రారంభమైనప్పటికీ సాంకేతిక సమస్యలతో రాకెట్లు మొరాయించారు. కుంభకర్ణుడి దిష్టిబొమ్మ దహనానికి ఏకంగా ఐదుసార్లు రాకెట్ వదిలితే కానీ దహనంకాలేదు. రావణాసురుడికి ఏకంగా తొమ్మిది సార్లు రాకెట్లు ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుం డా పోయింది. చివరికి రాకెట్లు పనిచేయకపోవడంతో ఎమ్మెల్యే కర్ర సాయంతో రావణాసురుడి దిష్టిబొమ్మకు దహనం చేశారు. సాధారణంగా సాయం త్రం 6గంటల నుంచి 7గంటల్లోపే పూర్త య్యే రావణ దహన కార్యక్రమం ఈసారి సాంస్కృతిక ప్రదర్శనలు, రాకెట్లు ఫెయిల్ కావడం వల్ల రాత్రి 10 గంటల వరకు సాగింది. వేడుకలకు వచ్చిన పట్టణ ప్రజలు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వేడుక ల్లో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనారాయణ, విట్టా రమేష్, మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నాగమణి, కునిగిరి నీలకంఠ, నాగరాజుగౌ డ్, మల్లప్ప, నాయకర్, స్వప్న, ఉపేంద్ర, శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తుగ్గలి: మండలంలో విజయదశమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తుగ్గలి, జొన్నగిరి, రాతన తదితర గ్రామాల్లో అమ్మవారి మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా సందర్బంగా చివరి రోజు విజయదశమి రోజున ప్రత్యేక పుష్పాలతో అలంకరించి అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి జమ్మిఆకును అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసిన అనంతరం పెద్దల ఆశీర్వచనాలు పొందారు.