Share News

కాలు తొక్కడంతోనే అయ్యన్న కోప్పడ్డారు!

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:37 AM

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత నెల 31న మరిడి మహాలక్ష్మి జాతర నిర్వహించారు. ఈ జాతర సమయంలో డప్పు కళాకారుడి చెంపపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొడుతున్న...

కాలు తొక్కడంతోనే అయ్యన్న కోప్పడ్డారు!

  • వైసీపీ రాజకీయం మానాలి: డప్పు కళాకారుడు

అనకాపల్లి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత నెల 31న మరిడి మహాలక్ష్మి జాతర నిర్వహించారు. ఈ జాతర సమయంలో డప్పు కళాకారుడి చెంపపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొడుతున్న వీడియో వైసీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయి తే.. ఈ వీడియోను సదరు కళాకారుడు నాగులాపల్లి రామదాసు ఖండించారు. ‘‘మద్యం మత్తులో ఉండి అయ్యన్న కాలిని తొక్కడంతో ఆయన నా మీద కోప్పడ్డారు. ఇంతకుమించి ఏమీ జరగలేదు. మేం చిన్నప్పటి నుంచి అయ్యన్న ఇంటి వద్ద కుటుంబ సభ్యులుగా పెరిగాం. దీనిని రాజకీయం చేయడం వైసీపీకి తగదు.’’ అని రామదాసు ఓ వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు స్పీకర్‌ క్యాంపు కార్యాలయం ఆ వీడియోను విడుదల చేసింది.

Updated Date - Apr 04 , 2026 | 04:40 AM