Share News

ఏపీ కార్ల్‌ సీఈవోగా దామోదర్‌నాయుడు

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:51 AM

కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీ కార్ల్‌) సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు...

ఏపీ కార్ల్‌ సీఈవోగా దామోదర్‌నాయుడు

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీ కార్ల్‌) సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు పశువైద్యకళాశాల అసోసియేట్‌ డీన్‌ శ్రీనివాస ప్రసాద్‌ను ఏపీ కార్ల్‌ సీఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడుకు ఏపీ కార్ల్‌ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2026 సీజన్‌లో రాష్ట్రంలో బీడీ ఆకు సేకరణ కోసం ప్రభుత్వ ఏజెంట్‌గా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ప్రభుత్వం నియమించింది. అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి అధ్యక్షతన సలహా కమిటీని ఏర్పాటు చేసింది.

Updated Date - Apr 16 , 2026 | 04:52 AM