Share News

దళితులే పూజారులు..

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:15 AM

పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల దళితవాడల్లో ఉన్న రామాలయాలు శ్రీరామ నవమి వేడుకలకు సిద్ధమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా దళితవాడల్లో వున్న రామాలయాల్లో ..

దళితులే పూజారులు..

పిడుగురాళ్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల దళితవాడల్లో ఉన్న రామాలయాలు శ్రీరామ నవమి వేడుకలకు సిద్ధమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా దళితవాడల్లో వున్న రామాలయాల్లో పూజా కైంకర్యాలను దళితులే నిర్వహిస్తున్నారు. దేవాలయాలకు ఆదాయం, ఆస్తులు లేకున్నా దాతల సాయంత ో పండుగల వేళ కార్యక్రమాలు కొనసాగించడం ఇక్కడ ఆనవాయితీ. పిడుగురాళ్ల సమీపంలోని జానపాడు, మండల కేంద్రమైన రాజుపాలెంలోని దళితవాడలో వున్న రామాలయాల్లో చలువ పందిళ్లు వేసి స్వామివారికి కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి పండుగకు దాతల సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ శ్రీరామనవమి వేడుకలను ఘ నం గా నిర్వహిస్తున్నామని రాజుపాలెం ఆలయ పూ జారి పొత్తూరి పట్టాభిరాములు, జానపాడు రామాలయం పూజారి మర్రి వెంకయ్య తెలిపారు. ప్రభుత్వం తమ దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.

Updated Date - Mar 27 , 2026 | 05:15 AM