దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:59 PM
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని పీపుల్స్ యాక్షన ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పులి గుజ్జు సురేష్, రోమన క్యాథలిక్ చర్చి డీల్ ఫాదర్ గొడుగునూరు ప్రవీణ్, కర్నూలు మేత్రసాన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కమిషన జాయింగ్ సెక్రటరీ చార్లెస్ అన్నారు.
పీపుల్స్ యాక్షన ఫోరం
రాష్ట్ర అధ్యక్షుడు పులి గుజ్జు సురేష్
ఆదోనిలో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ
సబ్ కలెక్టర్ కార్యాలయంలో
ఆర్డీవోకు వినతి పత్రం అందజేత
ఆదోని అగ్రికల్చర్, జూలై 13(ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని పీపుల్స్ యాక్షన ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పులి గుజ్జు సురేష్, రోమన క్యాథలిక్ చర్చి డీల్ ఫాదర్ గొడుగునూరు ప్రవీణ్, కర్నూలు మేత్రసాన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కమిషన జాయింగ్ సెక్రటరీ చార్లెస్ అన్నారు. సోమవారం పట్టణంలో దళిత హక్కుల సాధన కోసం భారీ ర్యాలీ చేపట్టారు. ఆదోని డివిజనలోని ఐదు నియోజవర్గాలకు చెందిన దళిత క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. స్థానిక కొత్త బస్టాండ్ రహదారిలోని ఆర్‌సీఎం చర్చి నుంచి ఎమ్మిగనూరు సర్కిల్ మునిసిపల్ మెయిన రోడ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రెండుకోట్ల మంది దళిత క్రైస్తవులు వివక్ష ఎదుర్కొంటున్న తమకు ఎస్సీ హక్కులను తీసివేయడం తగదన్నారు. మతం మారిన కులం మారదని అన్నారు. 1950 రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఆర్డర్ క్లాస్ త్రీ ప్రకారం హిందూ, సిక్కు బౌద్దులకు మాత్రమే ఎస్సీ స్టేటస్ క్రిస్టియన ముస్లిం దళితులకు రిజర్వేషనలు అట్రాసిటీ యాక్ట్ రక్షణ లభించదని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం శోచనీయమన్నారు. ఈ తీర్పుతో దళిత క్రైస్తవులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 14, 15 ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏమతానైనా అనుసరించవచ్చని రాజ్యాంగం చెపుతున్నా పాలకులు విస్మరించి కోర్డుల ద్వారా చెప్పిస్తున్నారన్నారు. ఆర్టికల్ 1950 క్లాస్ త్రీ ని సవరించి దళిత క్రిస్టియనలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌డీవో అరుణకుమారి వినతిపత్రం అందజేశారు. ఆయా గ్రామాల దళిత క్రైస్తవులు పాల్గొన్నారు.