ఎమ్మెల్సీగా రమాదేవి ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:02 AM
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన దళవాయి రమాదేవితో శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన దళవాయి రమాదేవితో శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర వర్గానికి చట్టసభల్లో అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.