Share News

నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర పోస్టులు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:36 AM

సోషల్‌ మీడియాలో నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర పోస్టులు

  • నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సృష్టించిన నిందితుడు

  • విశాఖలో అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన ఇదాదాసు అప్పారావు ఇటీవల నటి రేణుదేశాయ్‌కు సంబంధించిన ఓ రీల్‌ను చూశాడు. అనంతరం నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను సృష్టించాడు. దాని ద్వారా నటిపై అసభ్యకర, దూషణాత్మక వ్యాఖ్యలను పోస్టు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన సైబరాబాద్‌ సైబర్‌కైరమ్‌ పోలీసులు విశాఖపట్నంలో అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్‌ కైరమ్‌ పోలీసులు సోషల్‌ మీడియా వినియోగదారులకు పలు సూచనలు చేశారు. ‘సోషల్‌ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేయడం నేరం.’ అని హెచ్చరించారు.

Updated Date - Apr 10 , 2026 | 04:36 AM