Share News

శ్రీశైలం డ్యాంలో జలసంఘం బృందం

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:12 AM

శ్రీశైలం జలాశయాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) బృం దం బుధవారం పరిశీలిం చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు.. జలసంఘం చైర్మన్‌ అతుల్‌ జైన్‌, డ్యాం నిపుణులు డీకే శర్మ, టీకే శివరాజన్‌...

శ్రీశైలం డ్యాంలో జలసంఘం బృందం

శ్రీశైలం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) బృం దం బుధవారం పరిశీలిం చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు.. జలసంఘం చైర్మన్‌ అతుల్‌ జైన్‌, డ్యాం నిపుణులు డీకే శర్మ, టీకే శివరాజన్‌, హైడ్రో మెకానికల్‌ నిపుణుడు గుల్షన్‌రాజ్‌, జియాలజీ నిపుణుడు జేఎం గౌతమ్‌తో కూడిన బృందం శ్రీశైలం డ్యాంకు చేరుకున్నారు. డ్యాం పటిష్ఠత, భద్రత, ప్రస్తుత స్థితిగతులపై గతంలో నిపుణులు ఇచ్చిన నివేదికలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా క్షుణ్ణంగా విచారించి నీటి నిల్వల గురించి తెలుసుకున్నారు. ఆనకట్టపై పర్యటించి డ్యాం ఇరువైపులా వరదల సమయంలో కోతకు గురైన కొండ ప్రాంతాలను పరిశీలించి ఇంజనీర్లకు పలు కీలక సూచనలు చేశారు. గురువారం కూడా ఆనకట్టను పరిశీలించనున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 04:12 AM