Share News

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి : ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:42 PM

ప్రత్యామ్నాయ, అంతర పంటల సాగుతో నష్టాలు తప్పుతాయని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

 ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి : ఎమ్మెల్యే
రైతులకు పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

మద్దికెర, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ, అంతర పంటల సాగుతో నష్టాలు తప్పుతాయని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం పెరవలి గ్రామంలో రాయితీ పప్పుశనగ విత్తనాలను ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారన్నారు. అన్ని చెరువులకు కూడా నీరు నింపామన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులను నీటితో నింపడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మోహన విజయకుమార్‌, మాజీ జడ్పీటీసీ సభ్యులు పురుషోత్తం చౌదరి, వరలక్ష్మీ, పారా విశ్వనాథ్‌ అలియాస్‌ చిట్టెన్న పాల్గొన్నారు.

హాలహర్వి: మండలంలోని రైతులకు రాయితీపై శనగపప్పు విత్తనాలను టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌, ఏవో జిలానీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండలానికి 2030 క్వింటాళ్ల శనగ విత్తనాలు 35శాతం రాయితీ కింద మంజూరయ్యాయన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. విత్తనాల కోసం రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర పత్రాలతో వ్యవసాయ కార్యాలయానికి రావాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

తుగ్గలి: పప్పు శనగ పంటను సాగు చేసే ప్రతి రైతుకు విత్తనాలు అందజేస్తామని జడ్పీటీసీ మాజీ సభ్యులు వరలక్ష్మి, ఏఈవో లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం తుగ్గలి, గిరిగిట్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వం అందించిన రాయితీ పప్పుశనగ విత్తనాలను రైతులకు అందజేశారు. వారు మాట్లాడుతూ రాయితీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమలో ఏఈవో బాలసరస్వతి, సూర్యప్రకాష్‌ రెడ్డి, స్రవంతి, చైతన్య కుమారి, మాజీ ఎంపీటీసీ వల్లె వెంకటేశ, కృష్ణ, అయూబ్‌ బాషా, మాజీ సర్పంచ రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:42 PM