రాజధాని విద్యుత్తు పనుల్లో వేగం పెంచండి: సీఎస్
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:16 AM
అమరావతిలో ప్రస్తుతం కోర్ క్యాపిటల్ మీదుగా వెళుతున్న 400 కేవీ, 200 కేవీ ఎక్స్‌ట్రా హైటెన్షన్(ఈహెచ్‌టీ) విద్యుత్తు లైన్లను రీరూట్ చేసే పనులను వేగవంతం చేయాలని సీఆర్డీయే..
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రస్తుతం కోర్ క్యాపిటల్ మీదుగా వెళుతున్న 400 కేవీ, 200 కేవీ ఎక్స్‌ట్రా హైటెన్షన్(ఈహెచ్‌టీ) విద్యుత్తు లైన్లను రీరూట్ చేసే పనులను వేగవంతం చేయాలని సీఆర్డీయే, ట్రాన్స్‌కో అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. అమరావతిలో సాగుతున్న విద్యు త్తు పనుల పురోగతిపై సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, జేఎండీ ట్రాన్స్‌కో సూర్యసాయి ప్రవీణ్ చంద్ తదితరులతో సీఎస్ క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ.. పనులకు సంబంధించి దశలవారీ పురోగతితో పాటు నిర్ణీత సమయానికి పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా అడ్డంకులు లేదా ప్రాజెక్టు అమలు సంబంధిత సమస్యలు తలెత్తితే పరిష్కరించాలని, పనుల పురోగతిని పర్యవేక్షించాలని సీఆర్డీయే, ట్రాన్స్‌కోకు సూచించారు.