పద్యాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన వేమన: సీఎస్
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:31 AM
వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కొనియాడారు.
అమరావతి, జనవరి 19(ఆంధజ్ర్యోతి): వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కొనియాడారు. యోగి వేమన జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విజయానంద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు సోమవారం వేమన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.