Share News

2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం: సీఎస్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:07 AM

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) పని చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ చెప్పారు.

2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం: సీఎస్‌

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) పని చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఇన్సూరెన్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు బీమా కవరేజిని విస్తరించడానికి, బీమా ప్రయోజనాలు సామాన్యులకు చేరేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ చర్చించింది. అదేవిధంగా జీవిత బీమా, పంటల బీమా, మోటారు, ఆరోగ్య బీమాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. లీడ్‌ బీమా సంస్థలు మొదటి విడతలో సుమారు 5 వేల గ్రామ పంచాయతీలను దత్తత తీసుకున్నాయి.

Updated Date - Jan 08 , 2026 | 06:07 AM