పంటలు ఎండుముఖం
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:58 PM
కర్నూలు జిల్లాలోనే పత్తికొండ నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతం.
హంద్రీనీవా నీరు నిలిపేత
ఆందోళనలో అన్నదాతలు
ఏప్రిల్ ఆఖరు వరకు నీరు
విడుదల చేయాలని వేడుకోలు
మద్దికెర, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోనే పత్తికొండ నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతం. వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. హంద్రీ-నీవా కాలువ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో బావులు, బోర్లు పెరగడమే కాకుండా కాలువల ద్వారా వందల ఎకరాల భూములను సాగు చేస్తున్నారు. వారం రోజుల నుంచి శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా కాలువకు నీరు నిలుపుదల చేయడంతో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైతులు సాగు చేసిన పంటలు ఎం డుముఖం పడుతున్నాయి. మండలంలోని బురుజుల, పెరవలి, బసినేపల్లి, రాంపురం, రాంపురంకొట్టాల, హంపా, బొమ్మనపల్లి, కొత్తపల్లి, ఎడవలి, మద్దికెర గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 5వేల ఎకరాల్లో వేరుశనగ, వరి మినుము, పత్తి, మిరప, తదితర పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ ఆఖరి వరకు నీటి సరఫరా చేస్తుండటంతో రైతులు పంటలను సాగు చేశారు. దురదృష్టవశాత్తు ఈ ఏడా ది మార్చి 20వ తేదీ నీరు బంద్ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికి రా లేదు. ఉన్నఫలంగా నీరు నిలిపేస్తే పంటలు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా హంద్రీనీవా కాలువను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్నామనీ, తీరా ఇప్పుడు నీరు నిలిపేస్తే ఎలా అని రైతులు ప్రశ్నించారు. పంటలు చేతికి రావాలంటే కనీసం మరో 30 రోజులు అవుతుందని, అంతవరకైనా నీరు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పాలకులు, హంద్రీనీవా అధికారులు స్పందించి ఏప్రిల్ నెలాఖరు ముగిసేవరకు నీరు అందించాలని వేడుకుంటున్నారు.
పంటలు ఎండిపోతాయి
హంద్రీనీవా కాలువ కింద రెండెకరాల్లో వరి పంట సాగు చేశారు.ఇప్పుడు నీరు నిలిపే శారు. పంటలు ఎం డిపోయి నష్టపోతున్నాయనీ వాపోయాడు. తమ పంటలకు నీరు అందించి ఆదుకోవాలని కోరారు.
- లింగన్న, మద్దికెర
ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు విడుదల చేయాలి
ఏప్రిల్ చివరి వారం వరకు హంద్రీనీవా కాలువకు నీరు సరఫరా చేయాలి. లేకపోతే పది గ్రా మాల రైతుల పరిస్థితి దయనీయంగా మా రుతుంది. అన్నదాత లు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. నీరు విడుదల చేసి తమను ప్రభుత్వమే ఆదుకోవాలి.
- కృష్ణ యాదవ్, మద్దికెర