గోదావరిలో మొసళ్లు.. పాపికొండల వద్ద సంచారం
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:23 AM
పాపి కొండల వద్ద గోదావరిలో మొసళ్ల సంచారం ఉన్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల..
బంధించే ప్రయత్నంలో అధికారులు: మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పాపి కొండల వద్ద గోదావరిలో మొసళ్ల సంచారం ఉన్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, పాపికొండల వద్ద మొసళ్లు సంచరిస్తున్నట్టు అధికారులు తన దృష్టికి తెచ్చారని మంత్రి తెలిపారు. ఏడు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులిని బంధించినట్టే మొసళ్లను పట్టేస్తారని, ఇప్పటికే మొసళ్ల వేటలో అధికారులు నిమగ్నమయ్యారని చెప్పారు.