క్రికెటర్ దీపిక సొంతూరుకు రోడ్ల నిర్మాణం
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:05 AM
అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక సొంతూరు తంబాలహట్టికి బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు.
2 రహదారులకు రూ.6.20 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం
అమరాపురం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక సొంతూరు తంబాలహట్టికి బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం, కెప్టెన్ దీపిఇక తమ గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్పందించి శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టి నుంచి హేమావతికి, గుణేహళ్లికి బీటీ రోడ్లు మంజూరు చేశారు. తంబాలహట్టి-హేమవతి రోడ్డుకు రూ.3.20 కోట్లు, తంబాలహట్టి-గుణేహళ్లి రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. తంబాలహట్టి-హేమవతి రోడ్డుకు సాంకేతిక అనుమతులు రావడంతో పంచాయతీరాజ్‌శాఖ ఈఈ మురళీకృష్ట, డీఈఈ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇప్పటికే ఆ మార్గంలో జంగిల్ క్లియరెన్స్, రోడ్డు చదును పనులు చేయించారు. గుణేహళ్లి రహదారి పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.