Share News

కోట్లు పోగొట్టుకొని అనలిస్టుల అవతారం..

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:35 AM

క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తిరుపతి, గుంటూరు జిల్లాలకు చెందిన నలుగురు ప్రిడిక్షన్‌ అనలిస్టులను విశాఖ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.

కోట్లు పోగొట్టుకొని అనలిస్టుల అవతారం..

  • క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో నలుగురు అరెస్ట్‌

  • రిమాండ్‌కు తరలించిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

ఎండాడ (విశాఖపట్నం), జనవరి 27 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తిరుపతి, గుంటూరు జిల్లాలకు చెందిన నలుగురు ప్రిడిక్షన్‌ అనలిస్టులను విశాఖ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. నాని క్రికెట్‌ ప్రిడిక్షన్‌, వినయ్‌రెడ్డి క్రికెట్‌ కింగ్‌, మురళి క్రికెట్‌ అనలిస్ట్‌, అజయ్‌ క్రికెట్‌ అనలిస్ట్‌ అనే మారు పేర్లతో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్స్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన దేశినేని సుమంత్‌, లంకిపల్లి గణేష్‌, గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన కొప్పుల మురళి, అదే జిల్లా నగరపాలేనికి చెందిన మేడమ్‌ బద్రేశ్వర్‌ను సాంకేతికత ఆధారంగా సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వెట్‌సైట్‌లను ప్రమోట్‌ చేయడానికి వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పతో సహా ప్రిడిక్షన్‌ ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. బీటెక్‌, ఎంఎస్సీ చేసిన ఈ యువకులు ఒక్కొక్కరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. అనంతరం అనలిస్టులుగా అవతారమెత్తి దుబాయ్‌ బేస్డ్‌ బుకీస్‌ పర్యవేక్షణలో మురుగన్‌ బుక్‌, ఫెయిర్‌ ప్లే, విన్‌బజ్‌, వాజిర్‌విన్‌ అనే బెట్టింగ్‌ వెబ్‌సైట్లను టెలిగ్రామ్‌ చానెల్‌ ద్వారా ప్రమోట్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 04:37 AM