Share News

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:19 AM

యుద్ధం ప్రభావంతో నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని క్రెడాయ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ దాసరి రాంబాబు వెల్లడించారు.

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

విజయవాడ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): యుద్ధం ప్రభావంతో నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని క్రెడాయ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ దాసరి రాంబాబు వెల్లడించారు. ముడిసరుకుల ధరలు, ఇంధన ఖర్చులు పెరగడంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. స్టీల్‌, అల్యూమినియం ధరలు పెరగడంతో పాటు గ్లాస్‌, పీవీసీ పైపులు, ఎలక్ట్రికల్‌ సామగ్రి కొరత ఉందని వివరించారు. సిమెంట్‌, స్టీల్‌ ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ ప్రాజెక్టుల వ్యయం సగటున 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావం బిల్డర్లతో పాటు గృహ కొనుగోలుదారులపై పడుతోందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని, పన్ను రాయితీలు ఇవ్వాలని దాసరి రాంబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 05 , 2026 | 04:23 AM