రాజధాని సమీకృత మాస్టర్ ప్లాన్‌పై నోటిఫికేషన్
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:58 AM
అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ కోసం రెండో విడత భూసమీకరణ ప్రారంభమైన దృష్ట్యా సమీకృత మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది.
గుంటూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ కోసం రెండో విడత భూసమీకరణ ప్రారంభమైన దృష్ట్యా సమీకృత మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అనుభవం కలిగిన కన్సల్టెంట్ నియామకానికి అంతర్జాతీయంగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ షెడ్యూల్ డౌన్‌లోడింగ్ ప్రక్రియ ప్రారంభించి.. ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు గడువుగా నిర్ణయించింది. ఈ నెల 28న సీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రీ-ప్రపోజల్ భేటీ నిర్వహించనుంది.