Share News

క్రేన డ్రైవర్‌, యజమాని అరెస్టు

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:11 PM

గతనెల 27వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం విధితమే. రాంగ్‌ రూట్‌లో వచ్చిన క్రేన డ్రైవర్‌తో పాటు యజమానిని బుధవారం అరెస్టు చేశారు.

   క్రేన డ్రైవర్‌, యజమాని అరెస్టు
డోనలో క్రేన డ్రైవర్‌ అరెస్టును చూపిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

డోన రూరల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గతనెల 27వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం విధితమే. రాంగ్‌ రూట్‌లో వచ్చిన క్రేన డ్రైవర్‌తో పాటు యజమానిని బుధవారం అరెస్టు చేశారు. డోన డీఎస్పీ పి. శ్రీనివాసులు డోన రూరల్‌ పోలీస్‌ స్టేషనలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 27న డోన మండలం జగదుర్తి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు, రాంగ్‌ రూట్‌లో వచ్చిన క్రేనను ఢీకొన్నాయి. ఈ ఘటనలో కర్ణాటక వాసులు శాంత, ఆమె పిల్లలు భార్గవి, సిద్దార్థ మృతి చెందారు. దీంతో క్రేన డ్రైవర్‌ నాగరాజాపై, క్రేన యజమాని వడ్డె తెలుగు నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రేన డ్రైవర్‌ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా పిడిహల్లికి చెందిన వ్యక్తి అని, క్రేన వాహన యజమాని డోన పట్టణం నెహ్రూనగర్‌ చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఆటోలు, మోటారు బైకులు, లారీలు, బస్సులు రాంగ్‌ రూట్‌లో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డోన హైవేపై సీసీ కెమెరాల నిఘా ఉందని, రాంగ్‌ రూట్‌లో వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రూరల్‌ సీఎం సీఎం రాకేష్‌, రూరల్‌ ఎస్‌ఐ మమత, ఏఎ్‌సఐ గోపాల్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:11 PM