CPS Employees: అందరికీ ఆరు విడతల డీఏ బకాయిలు చెల్లించాలి
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:22 AM
డీఏ బకాయిల చెల్లింపుల్లో అసమానతలు, సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని పీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు..
సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్
విజయవాడ (గాంధీనగర్), జనవరి 16 (ఆంధ్రజ్యోతి): డీఏ బకాయిల చెల్లింపుల్లో అసమానతలు, సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని పీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. 2018-19 ఏడాదికి డీఏ బకాయిలను సంక్రాంతి కానుకగా ఈ నెల 14న నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు సుమారు రూ.1100 కోట్లు విడుదల చేయడంపై శుక్రవారం వారు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు విడతల బకాయిల నగదు చెల్లింపులు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా చెల్లించారన్నారు. ఇటువంటి అసమానతలు తొలగించి అందరికి ఆరు విడతల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.