Share News

ఇలాగైతే ‘పోలవరం’ పూర్తికి దశాబ్దాలే: సీపీఎం

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:12 AM

కేంద్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్న అరకొర నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని...

ఇలాగైతే ‘పోలవరం’ పూర్తికి దశాబ్దాలే: సీపీఎం

  • కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై రాఘవులు నిరసన

  • వచ్చే నెల 24న ‘చలో ఢిల్లీ’

అమరావతి, గవర్నర్‌పేట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్న అరకొర నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు, పార్లమెంటులో చేస్తున్న ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మార్చి 9 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించి, 24న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ భౌతిక దాడులు అభ్యంతరకరమన్నారు. టీడీపీ, వైసీపీలు దాడుల సంస్కృతిని, అసభ్యంగా మాట్లాడటాన్ని విరమించుకోవాలని సూచించారు.

Updated Date - Feb 03 , 2026 | 06:13 AM