ఏయూ ప్రతిష్ఠ దిగజారుస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్ఎస్: సీపీఎం
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:56 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అప్రదిష్ఠపాలు చేయడానికి బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ కంకణం కట్టుకున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...
అనకాపల్లి టౌన్ (అనకాపల్లి జిల్లా), ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అప్రదిష్ఠపాలు చేయడానికి బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ కంకణం కట్టుకున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మేధో మఽథనానికి ప్రతీకగా నిలిచిన ఏయూలో బీజేపీ, అనుంబంధ సంఘాల అరాచకాలను విద్యా వేత్తలు, ప్రజలు ఖండించాలని కోరారు.