CPI: చర్చలతో జల వివాదాలను పరిష్కరించుకోవడమే మేలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:28 AM
జల వివాదాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుహృద్భావ వాతావరణంలో చర్చించుకుని పరిష్కారం చేసుకుందామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను సీపీఐ...
రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను స్వాగతించిన సీపీఐ
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): జల వివాదాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుహృద్భావ వాతావరణంలో చర్చించుకుని పరిష్కారం చేసుకుందామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను సీపీఐ స్వాగతించింది. కోర్టులు, కేంద్రం వద్ద పంచాయతీ పెట్టకుండా రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించుకుని వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటిగా కలిసి ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి నదీ జలాలపై ఆధారపడి ఉందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా ఉన్న జలాలను సద్వినియోగం చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రామకృష్ణ ఆకాంక్షించారు.