Share News

రాష్ట్రాన్ని రావణ కాష్ఠంలా మార్చొద్దు: సీపీఐ

ABN , Publish Date - Feb 03 , 2026 | 04:03 AM

పరస్పర దాడులతో రాష్ట్రాన్ని రావణ కాష్ఠంలా మార్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య టీడీపీ, వైసీపీలకు హితవు పలికారు.

రాష్ట్రాన్ని రావణ కాష్ఠంలా మార్చొద్దు: సీపీఐ

అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): పరస్పర దాడులతో రాష్ట్రాన్ని రావణ కాష్ఠంలా మార్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య టీడీపీ, వైసీపీలకు హితవు పలికారు.‘రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఆ రెండు పార్టీల నేతలు పరస్పర దూషణలకు దిగి, దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రం ప్రజల ఆస్తి. చంద్రబాబు, జగన్‌, పవన్‌, లోకేశ్‌ల సొత్తు కాదు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌లు హుందాతనాన్ని కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోవడం శోచనీయం. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గం’ అని సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 04:04 AM