Share News

CPI Narayana: ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:59 AM

ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందుల్లో పడేసేలా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నారాయణ డిమాండ్‌ చేశారు.

CPI Narayana: ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

  • సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నారాయణ

తిరుపతి(విద్య), జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందుల్లో పడేసేలా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం తిరుపతి నగరం బైరాగిపట్టెడలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ నేతలతో కలిసి ఆయన ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ట్రంప్‌ ఇతర దేశాలపై వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రపంచం ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోనని ఆందోళనగా ఉందన్నారు. ఒక దేశాధ్యక్షుడు, ఆయన భార్యను రాత్రికి రాత్రే కిడ్నాప్‌ చేసినట్లు వ్యవహరించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే వెనుజువెలాపై అమెరికా ఇలాంటి దురాగతానికి పాల్పడటం వెనుక కార్పొరేట్‌ కంపెనీల స్వార్థం దాగుందని ఆయన ఆరోపించారు

Updated Date - Jan 14 , 2026 | 05:00 AM