కార్మిక సంఘాలపై వ్యాఖ్యలు సరికాదు: సీపీఐ
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:20 AM
విశాఖ ఉక్కు ప్రమాదంలో బాధిత కుటుంబాల తరఫున నిలబడిన కార్మిక సంఘాల నాయకులను మంత్రి లోకేశ్ తూలనాడటం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు.
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ప్రమాదంలో బాధిత కుటుంబాల తరఫున నిలబడిన కార్మిక సంఘాల నాయకులను మంత్రి లోకేశ్ తూలనాడటం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని గట్టిగా నిలదీసిన కార్మిక సంఘాలకు సమాధానం చెప్పకుండా ‘మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా!’ అంటూ వెటకారంగా మాట్లాడటం దుర్మార్గమని మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు.