Share News

వ్యవస్థలను అవమానించేలా ఐఏఎస్‌ల ప్రవర్తన: సీపీఐ

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:56 AM

కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ల ప్రవర్తన వ్యవస్థలను అవమానపరిచేలా ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ అన్నారు.

వ్యవస్థలను అవమానించేలా ఐఏఎస్‌ల ప్రవర్తన: సీపీఐ

గుంటూరు(తూర్పు), మార్చి 3(ఆంధ్రజ్యోతి): కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ల ప్రవర్తన వ్యవస్థలను అవమానపరిచేలా ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ అన్నారు. గుంటూరు, సీపీఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థలు సమాజంలో చాలా గౌరవప్రదమైనవి. ఈ హోదాల్లో విధులు నిర్వర్తించే అధికారులు లక్ష్మణ రేఖ దాటకుండా పనిచేయాలి. వీరు తమ బాధ్యతలను విస్మరిస్తే అభాసుపాలౌతారు. ఇందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఘటనను ఉదాహరణగా తీసుకోవాలి. టీటీడీలో అప్పటి అధికారులు సమర్థవంతంగా విఽధులు నిర్వహిస్తే ఈ గొడవలు వచ్చేవి కాదు. ధార్మిక సంస్థల్లో కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, అవినీతి రాజకీయ నాయకులను నియమించే సంస్కృతి మారాల్సిన అవసరం ఉంది. వీరిని చైర్మన్లుగా నియమించడంతో దేవుడి పేరుతో వ్యాపారం చేసే అవకాశాలు ఉంటాయి. వీరు చేసే పనులతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి’ అని నారాయణ అన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 03:57 AM