ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:59 AM
రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎంకు ఈశ్వరయ్య లేఖ
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎస్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర సంస్థగా ఏర్పాటైంది. 2024 మార్చి నుంచి ఈ కమిషన్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినప్పటికీ ఆ నియామకాన్ని చేపట్టకపోవడం విచారకరం. రాష్ట్రంలో జరుగుతున్న పలు మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు’ అని ఈశ్వరయ్య పేర్కొన్నారు.