Share News

అమెరికా కనుసన్నల్లో కేంద్రం: సీపీఐ రామకృష్ణ

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:50 AM

యుద్ధ వాతావరణాల వల్ల ప్రజాస్వామ్యానికి తీరని నష్టం చేకూరుతుందని తెలిసినా ప్రధాని మోదీ మౌనం వహించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అమెరికా కనుసన్నల్లో కేంద్రం: సీపీఐ రామకృష్ణ

అనంతపురం ఉన్నత విద్య, మార్చి 23(ఆంధ్రజ్యోతి): యుద్ధ వాతావరణాల వల్ల ప్రజాస్వామ్యానికి తీరని నష్టం చేకూరుతుందని తెలిసినా ప్రధాని మోదీ మౌనం వహించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమెరికా దాడులను ఖండించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం అమెరికా కనుసన్నల్లో నడుస్తోంది. మన దేశం ఆయిల్‌ ఎవరి నుంచి కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలనేది అమెరికా నిర్ణయిస్తోంది. ఇండియా-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్‌ 62 సార్లు చెప్పినా మోదీ మాట్లాడకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. వెనుజువెలా అధ్యక్షుడు, ఆయన భార్యను నిర్బంధించి అమెరికాకు తీసుకెళ్లినా, ఇరాన్‌పై దాడులు చేస్తున్నా ప్రధాని మోదీ మాట్లాడటానికి భయపడుతున్నారు. అమెరికా దుశ్చర్యలను ప్రధాని వెంటనే ఖండించాలి. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విద్యార్థుల భోజనం గురించి అలా మాట్లాడటం సిగ్గుచేటు. పేద విద్యార్థులకు భోజనం పెడితే గరికపాటికి బాధ ఎందుకో అర్థం కావడం లేదు. గుడ్డు ఇచ్చినంత మాత్రాన శోభనం పెళ్లికొడుకులా అవుతారంటే గరికపాటికి రోజూ నాలుగు గుడ్లు ఇస్తాం. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’ అని రామకృష్ణ అన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 04:50 AM