బడ్జెట్ సెషనా? లడ్డూ సెషనా?: సీపీఐ
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:22 AM
రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా? తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా?
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా? తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా? అనేది అర్థం కావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్యలు లేనట్టుగా అధికార, ప్రతిపక్షాలు వాదోపవాదాలు, పరస్పర దూషణలకు దిగడం విచారకరమని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.