Share News

CPI Narayana: 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:21 AM

విజయవాడ స్వరాజ్య మైదానం(పీడబ్ల్యూడీ గ్రౌండ్‌)లో అంబేడ్కర్‌ స్మృతి వనం ఏర్పాటు చేసి ప్రతి ఏడాది నిర్వహించే పుస్తక మహోత్సవానికి అవకాశం లేకుండా...

CPI Narayana: 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ

  • వైసీపీవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

  • వారికి అంబేడ్కర్‌పై ఎలాంటి ప్రేమ లేదు

  • ఈ-బుక్‌ పఠనంతో పుస్తకం చదివిన అనుభూతి రాదు: నారాయణ

విజయవాడ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వరాజ్య మైదానం(పీడబ్ల్యూడీ గ్రౌండ్‌)లో అంబేడ్కర్‌ స్మృతి వనం ఏర్పాటు చేసి ప్రతి ఏడాది నిర్వహించే పుస్తక మహోత్సవానికి అవకాశం లేకుండా చేశారని సీపీఐ జాతీయ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ అన్నారు. గత ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసి స్వరాజ్య మైదానం లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఆ ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై ఎలాంటి ప్రేమ లేదని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన 36వ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పుస్తక మహోత్సవం నిర్వహించడానికి అనుమతుల కోసం ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ఈ మహోత్సవాలు నిర్వహించడానికి అనుమతుల కోసం వీబీఎ్‌ఫఎస్‌ ప్రతినిధులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పుస్తక మహోత్సవం నిర్వహించడానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. పుస్తక మహోత్సవాలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలి. చాట్‌ జీపీటీ, ఏఐ ఎన్ని వచ్చినా పఠనం తగ్గలేదు. ఈ బుక్‌ పఠనంలో పుస్తకం చదివిన అనుభూతి రాదు.’ అని నారాయణ అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ నోరు కట్టేశారు

‘నేను, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఒకేలా మాట్లాడతాం. ఆయన నోరు కట్టేశారు. నాకు ఆ పరిస్థితి లేదు. నేను ఏదైనా మాట్లాడగలను. ఆర్‌ఆర్‌ఆర్‌కు మాత్రం ఆ అవకాశం లేదు’ అని నారాయణ అన్నారు. దీనిపై ఆర్‌ఆర్‌ఆర్‌ స్పందించారు. ‘నిజమే. నా నోరు కట్టేశారు. ఇది వాస్తవం. నారాయణ మాట ఎంత కటువుగా ఉంటుందో మనస్సు అంత మంచిది’ అని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 03 , 2026 | 05:23 AM