అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారు: నారాయణ
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:43 AM
అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు.
భీమవరం టౌన్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వారాహి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూసే నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. చంద్రబాబు అవసరాల రీత్యా మోదీతో అంటకాగుతున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీని, నెహ్రూను చరిత్రలో తుడిచేయడానికి మోదీ పరివారం కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంనిధుల్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా మార్పులు చేయడం పథకాన్ని రద్దుచేయడానికేనని మండిపడ్డారు.