Share News

K Narayana: కమ్యూనిజం అజేయమైంది: నారాయణ

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:36 AM

కమ్యూనిజం అజేయమైంది.. కమ్యూనిస్టులు కనుమరుగైపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. కానీ ఖమ్మంలో కమ్యూనిస్టులను చూడండ’ని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిటీ చైర్మన్‌ కే నారాయణ అన్నారు.

K Narayana: కమ్యూనిజం అజేయమైంది: నారాయణ

కమ్యూనిజం అజేయమైంది.. కమ్యూనిస్టులు కనుమరుగైపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. కానీ ఖమ్మంలో కమ్యూనిస్టులను చూడండ’ని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిటీ చైర్మన్‌ కే నారాయణ అన్నారు. చంద్రబాబునాయుడు, జగన్‌, కేసీఆర్‌ వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌ అడ్డాగా ఆదానీ కంపెనీలు గంజాయిని ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంటే.. అలాంటి మోదీకి ఈ నేతలు మద్దతివ్వడం హేయమని అన్నారు. నిరుపేదల కూటి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఇంత అన్నం పెడుతుంటే ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చుతోందని విమర్శించారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా సభలో ప్రసంగించారు. వేలాదిగా తరలివచ్చిన సీపీఐ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, సింగరేణి కార్మికులతో ఖమ్మం ఎరుపెక్కింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ శతాబ్ది ఉత్సవ జ్ఞాపికను అందించారు. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీపీఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 04:36 AM