బత్తలపల్లికి చేరిన సీపీఐ పాదయాత్ర
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:21 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి బత్తలపల్లి మండలం సంజీవపురం కాటక్షేత్రానికి చేరుకుంది.
బత్తలపల్లి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి బత్తలపల్లి మండలం సంజీవపురం కాటక్షేత్రానికి చేరుకుంది. ఈ పాదయాత్ర మండల సరిహద్దు యర్రాయపల్లి వద్దకు చేరుకోగానే సీపీఐ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి పాదయాత్రగా సంజీవరం సమీపంలోని కాటకోటేశ్వర క్షేత్రం వద్దకు చేరుకున్నారు. రాత్రి కాటమక్షేత్ర సమీపంలోని టీటీడీ కల్యాణమండపంలో బసచేశారు. ఈ పాదయాత్రకు వైసీపీ నాయకులు బగ్గిరి బయపరెడ్డి, ముష్టూరు నరసింహారెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ పాదయాత్రలో సీపీఎం శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్, కాటమయ్య, సీపీఐ నియోజకవర్గకార్యదర్శి ముసుగు మధు పాల్గొన్నారు.