ఆర్ట్స్ గ్రూపులకు ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - May 17 , 2026 | 05:12 AM
రాష్ట్రంలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలతో సహా అన్ని జూనియర్ కాలేజీల్లో ఆర్ట్స్ గ్రూపులకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించాలని..
మాతృభాషను పరిరక్షించాలి: సీపీఐ రామకృష్ణ
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలతో సహా అన్ని జూనియర్ కాలేజీల్లో ఆర్ట్స్ గ్రూపులకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించాలని, అలాగే, తెలుగు భాష పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు. కార్పొరేట్ విద్యా విధానంలో జూనియర్ కాలేజీలు ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వైపు మళ్లిస్తూ... సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ వంటి ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల గ్రూపులను నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన తగ్గిపోతోందన్నారు.