Share News

విద్య, వైద్యాన్ని ప్రైవేటు పరం చేయొద్దు

ABN , Publish Date - May 12 , 2026 | 04:51 AM

విద్యను, వైద్యాన్ని ప్రైవేటు పరం చేయొద్దని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం మళ్లీ భూేసరణ చేయడం మంచి ...

విద్య, వైద్యాన్ని ప్రైవేటు పరం చేయొద్దు

  • పూర్తి విలాసవంతంగా చంద్రబాబు

  • ఇంకా ప్రతిపక్ష నేతలాగే రేవంత్‌: సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, మే 11(ఆంధ్రజ్యోతి): విద్యను, వైద్యాన్ని ప్రైవేటు పరం చేయొద్దని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం మళ్లీ భూేసరణ చేయడం మంచి ఆలోచన కాదన్నారు. భూములు తీసుకుని కార్పొరేట్‌ కంపెనీలకు తక్కువ ధరకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పూర్తి విలాసవంతంగా మారిపోయారని ఆరోపించారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తే, అది వ్యవస్థలకు నష్టమన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ సంకుచిత మనస్తత్వం వల్లే పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. వామపక్షాల వల్లే తమిళనాడులో టీవీకే అధికారంలో ఉందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - May 12 , 2026 | 04:51 AM