మోదీ.. తక్షణం రాజీనామా చేయండి: నారాయణ
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:03 AM
‘కేంద్రప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలి’ అని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ డిమాండ్ చేశారు.
గుంటూరు(తూర్పు), ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ‘కేంద్రప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలి’ అని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ డిమాండ్ చేశారు. ‘మహిళల ఓట్ల కోసం మోదీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు. వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వేళ దుర్బుద్ధితో మహిళా రిజర్వేషన్ల అమలుకు నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెడుతూ బిల్లు ప్రవేశపెట్టింది. ఏ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. ఆర్‌ఎ్‌సఎస్ నుంచి పుట్టిన బీజేపీయే నిజమైన మహిళా వ్యతిరేకి. జనగణన జరుగకుండా, జనాభా సంఖ్య తెలియకుండా ఈ బిల్లులు కార్యరూపం దాల్చలేవని మోదీకి, బీజేపీ నేతలకు తెలుసు. అయినప్పటికీ మహిళలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని నారాయణ విమర్శించారు.