ఇజ్రాయెల్‌తో సంబంధాలు దేశానికి నష్టం
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:43 AM
ఇరాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకు లేదు. ఇజ్రాయెల్‌తో కలసి ఆ దిశగా ముందుకు వెళ్తుంది.
ఇరాన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నాం: నారాయణ
గుంటూరు(తూర్పు), మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘‘ఇరాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకు లేదు. ఇజ్రాయెల్‌తో కలసి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అటువంటి ఇజ్రాయెల్‌తో సంబంధాలు భారత్‌కు తీవ్ర నష్టం’ అని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ అభిప్రాయపడ్డారు. యుద్ధానికి వ్యతిరేకంగా సోమవారం గుంటూరులో జరిగిన నిరసనర్యాలీలో నారాయణ మాట్లాడారు. ‘భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలి. మాట వినని దేశాలపై అమెరికా అవలంబిస్తున్న నియంతృత్వ అప్రజాస్వామిక పోకడలను నిలదీయాలి’ అని నారాయణ తెలిపారు.