అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:16 AM
మాజీ నక్సలైట్లు తమ సుదీర్ఘ అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని సీపీఐ నేత నారాయణ సూచించారు. మంగళవారం తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో...
మాజీ నక్సలైట్లకు సీపీఐ నేత నారాయణ సూచన
రైల్వేకోడూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మాజీ నక్సలైట్లు తమ సుదీర్ఘ అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని సీపీఐ నేత నారాయణ సూచించారు. మంగళవారం తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో మీడియాతో మాట్లాడారు. ‘లొంగిపోయిన నక్సలైట్లు సరైన ఉపాధి లేక, స్వేచ్ఛ కరువై, ఎవరినీ కలవడానికి వీలులేకుండా ఆంక్షల మధ్య బతుకుతున్నారు. 40 ఏళ్లకు పైబడి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాక కనీస ఆధారం, ఆత్మగౌరవం లేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వారికి పునరావాసం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇబ్బందుల్లో ఉన్న మాజీ నక్సలైట్లకు సహాయం చేయడానికి సీపీఐ సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. కడప-రైల్వే కోడూరు మీదుగా తిరుపతికి ఉన్న అధ్వానమైన రోడ్లను వెంటనే బాగుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.