Share News

సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం

ABN , Publish Date - May 02 , 2026 | 03:48 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తల్లి కె.గౌరమ్మ (100) మృతిచెందారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లికి చెందిన ఆమె..

సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం

ఆలూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తల్లి కె.గౌరమ్మ (100) మృతిచెందారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లికి చెందిన ఆమె గురువారం అనారోగ్యానికి గురికావడంతో ఆదోనిలో ఓ ప్రవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. చిన్న పేర్వలయ్య, గౌరమ్మ దం పతులకు రామకృష్ణతో పాటు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తె లు. తల్లి సలహాలతో రామకృష్ణ విద్యార్థి నాయకుడిగా, అనంతపురం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. గౌరమ్మ మృతికి పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు.

Updated Date - May 02 , 2026 | 03:48 AM