పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరుబాట: ఈశ్వరయ్య
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. మార్చి 24వ తేదీ లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన రాకపోతే.. ఆ మర్నాడే లక్షలాది మంది నిరుపేదలతో అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గురువారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు.