పాఠ్యపుస్తకాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీపీఐ
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:17 AM
ఇంటర్మీడియట్ సెకెండియర్ పాఠ్యపుస్తకాల లీకేజీ అంశంలో గైడ్‌లు ముద్రించే పబ్లిషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ సెకెండియర్ పాఠ్యపుస్తకాల లీకేజీ అంశంలో గైడ్‌లు ముద్రించే పబ్లిషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలకు ఆయన లేఖలు రాశారు. గైడ్‌లు, క్వశ్చన్ బ్యాంకులు, ఇతర స్టడీ మెటీరియల్‌ను విక్రయించే పబ్లిషర్లు ప్రభుత్వ అనుమతి రాకముందే ప్రభుత్వ కంటెంట్‌ను తీసుకుని వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కాగా వీజీఎస్ పబ్లిషర్స్ నుంచే ఇంటర్మీడియట్ కంటెంట్ లీకైనట్లు ఇంటర్ విద్యాబోర్డు గుర్తించింది.