CPI: రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయండి
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:58 AM
రాష్ట్రంలో రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార పంపిణీలో ప్రభుత్వ నిబంధనలు, సమయపాలన పాటించడం లేదు. అధిక శాతం రేషన్ డిపోల్లో కాటాల్లో లోపాలు, తూకంలో మోసాలకు పాల్పడుతుండటంతో కార్డుదారులు నష్టపోతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ దుకాణదారులపై చర్యలు తీసుకోవాలి.. అని కోరారు.