Share News

సమస్యలు గాలికి వదిలేశారు

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:52 AM

ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు లడ్డూ రాజకీయం...

సమస్యలు గాలికి వదిలేశారు

  • లడ్డూ రాజకీయాల్లో కూటమి నాయకులు: సీపీఐ రామకృష్ణ

ఆలూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు లడ్డూ రాజకీయం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ అసెంబ్లీలో, ఢిల్లీలో, ప్రెస్‌మీట్లలో సీఎం చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులపై చర్చించకుండా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన సమస్యలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 23 , 2026 | 04:52 AM