Share News

CPI state secretary G. Eswarayya criticized: స్టీల్‌ప్లాంట్‌ భూముల ధారాదత్తం తగదు

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:50 AM

విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన 2,500 ఎకరాల స్టీల్‌ ప్లాంట్‌ భూములను ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం...

 CPI state secretary G. Eswarayya criticized: స్టీల్‌ప్లాంట్‌ భూముల ధారాదత్తం తగదు

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన 2,500 ఎకరాల స్టీల్‌ ప్లాంట్‌ భూములను ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు 9 జిల్లాల పరిధిలో విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ పేరుతో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రణాళికలో ఈ ప్రతిపాదనలు ఉండటం విచారకరమని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 09 , 2026 | 05:50 AM