Share News

రాజ్యాంగ పీఠిక ఆశయాలకు బద్ధులవ్వాలి: సీపీఐ

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:29 AM

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం పునరంకితమవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.

రాజ్యాంగ పీఠిక ఆశయాలకు బద్ధులవ్వాలి:  సీపీఐ

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం పునరంకితమవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు అందరూ బద్ధులై ఉండాలి. రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక అనే పదాలను కనుమరుగు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్‌షాల నేతృత్వంలో కుట్ర జరుగుతోంది’ అని ఆరోపించారు.

Updated Date - Jan 27 , 2026 | 04:30 AM